బీజేపీ ఛాయలలోనే తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు?

బీజేపీ ఛాయలలోనే తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు?తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ బీ జేపీ హడావుడి మాత్రం తగ్గింది లేదు. లోక్‌సభ ఎన్ని కల్లో కనీసం పది స్థానాలు తెచ్చుకోవాలని హోంమంత్రి అమిత్‌షా ఇటీవల దిశాని ర్దేశం చేసివెళ్లారు కూడా. బీజేపీపై విమ ర్శలు తగ్గించి దగ్గరైనట్టు కనిపించడమే బీఆర్‌ఎస్‌ పరాజయానికి ఒక ముఖ్య కార ణమని రాజకీయ వర్గాలు గట్టిగా అంచ నా వేస్తున్నాయి. అయినా తమ వైఖరి మార్చుకోకపోగా అయోధ్యపైనా, హిందు వులపైన ట్వీట్లు చేయడం ద్వారా హిందూ త్వకు దగ్గరగా వున్నామనే భావం కలిగిం చేందుకు ఆ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌పై రాజకీయ విమర్శలు ఒకటైతే హిందువులపై వ్యతిరేకత కాంగ్రెస్‌ డిఎన్‌ఎ లోనే వుందని ఆ పార్టీ ఎంఎల్‌సి కవిత ఇటీవల చేసిన వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతోంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ లోనైతే పాలక వైసీపీ, ప్రతిపక్షాలుగా వున్న తెలుగు దేశం జనసేన పార్టీలు పొరబాటున కూడా బీజేపీ మతరాజకీయాలనూ, నిరంకుశ పోకడలనూ ప్రస్తా వించింది లేదు. ఆఖరుకు ప్రత్యేక హోదా,విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలలోనూ పూర్తి మౌనం పాటి స్తున్న పరిస్థితి. ఈ విధంగా ఏపీలో వలె పాలక ప్రతి పక్షాలు రెండూ బీజేపీకి అనుకూలంగా వుండటం దేశంలోని మరే రాష్ట్రంలోనూ చూడం. తెలుగు రాష్ట్రా లలో బీజేపీ పెద్ద శక్తి కాదుగనక దానిపై పోరాటం, విమర్శలు అవసరం లేదనే వాదన ఎంత తప్పో దీన్ని బట్టే తెలుస్తోంది. వామపక్షాలు మతతత్వ ప్రమాదం గురించి చెబితే ఏదో సిద్ధాంత పరంగా మాట్లాడటమే గాని ఇక్కడ వర్తించదని అపహాస్యం చేసేవారికి లోటు లేదు. అయితే మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఏపీతో సహా రెండుచోట్ల రాబోయే ఎన్నికల పోటీల తీరుతెన్నులు చూస్తే ఈ విధమైన వాదనలు ఎంత తప్పో స్పష్టమవుతుంది. తెలంగాణలో మరింతగా పాగా వేయడానికి ఒక వైపు, ఏపీలో టీడీపీ జనసేన కూటమితో కలసి పోటీ చేసేందుకు మరోవైపు బీజేపీ పాచికలు వేస్తున్నదనే వాస్తవం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి విశాఖలో యువ గళం ముగింపు సభకు ముందు టీడీపీ నాయకుడు లోకేశ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాహాటంగానే బీజేపీికి ఆహ్వానం పలికాడు. ఆ సభలో పవన్‌ కళ్యాణ్‌ బీజేపీి ఆశీస్సులు కోరడం ద్వారా తమ వ్యూహాన్ని వెల్లడిం చారు. బీజేపీికి తెలుగుదేశం తలుపులు తీసేవున్నా యని ఈ శీర్షికలో చాలాసార్లు చెప్పుకున్న విషయమే. కాకపోతే వైఎస్‌ షర్మిల ఏపీలో ప్రవేశించనుండటం దీనికి మరింత నాటకీయత తెచ్చిపెట్టింది.
ఏపీ రాజకీయ పరిణామాలు
ఏపీలో అంగన్‌వాడీల సమ్మె,మున్సిపల్‌ కార్మి కులు, సర్వ శిక్ష అభియాన్‌ కార్మికులు ఇలా అన్ని తరగతులూ పోరాటంలో వున్నా ప్ర భుత్వ స్పందన లేకపోగా అరెస్టులతో బెదిరింపులతో విరుచుకుపడుతు న్నది. పేదల సంక్షేమమే తమ లక్ష్య మనే వారు ఈ అట్టడుగు వర్గాల శ్రామికుల న్యాయమైన కోర్కెల విష యంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు సిద్ధం కావడం లేదు. వీటిపై పోరాడబోతే పౌర హక్కులు, రాజకీయ కార్యకలాపాలనపైన దాడు లు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల వరకూ మంచివైనా అభివృద్ధి, పాలనాపరమైన అస మర్థత,అవినీతి ఆరోపణలు, అప్పులు తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.వైసీపీ, టీడీపి, జనసేన మధ్య అసహన రాజకీయాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అరెస్టుతో పరాకాష్టకు చేరాయి. ఆయన బెయిలుపై విడుదలయ్యేసరికి ఎన్నికల వాతావరణం వచ్చేసింది. గనక ఇప్పుడు అందరి దృష్టి అటే కేంద్రీకృతమైంది.చంద్రబాబు జైలు లో వుండగానే టీడీపీతో పొత్తును ప్రక టించిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్‌డిఎలో కొన సాగుతూ తన విమర్శలను జగన్‌ సర్కారు తొలగింపువరకే పరిమితం చేస్తున్నారు. కేంద్రంలో మోడీని పున: ప్రతిష్టించడం కోసమే పనిచేస్తున్నానని ప్రకటిస్తున్నారు. సనాతన ధర్మ ప్రవచ నాలు తరచూ వినిపిస్తున్నారు.
మోడీకి నిరంతరం విధేయంగా వుండే జగన్‌ తన సర్కారుపై అసం తృప్తిని గుర్తించి అభ్యర్థుల భారీ మార్పు ద్వారా గట్టెక్కాలనుకుంటున్నారు. సిం హం సింగిల్‌గానే వస్తుందంటూ తమకు ఎవరితో రాజకీయంగా సంబంధం లేద న్నట్టు మాట్లాడుతున్నారు గాని ఆయన కూడా మోడీ విధానాలపై పల్లెత్తు మాటనడం లేదు. ఇదే ఇప్పటి ఎన్నికల దృశ్యం. జగన్‌ ఢిల్లీ పర్యటనల్లో వినతులు తప్ప క్షేత్రస్థాయిలో రాజకీయ ఒత్తిడి రాష్ట్రం కోసం ఉమ్మడిగా ఉద్యమించడం వంటి ఉదా హరణలే చూడం.ఈ రెండు శిబిరాలు ఒకరికి వ్యతి రేకంగా ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేయడంలోనే పోటీ పడుతుంటారు. పరస్పర పోటీలో మోడీ అశీ స్సుల కోసం పాకులాడుతుంటారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో ఎన్‌డిఎతో విడగొట్టుకుని విమర్శలతో చెలరేగిపోయిన చంద్రబాబు ఓటమి తర్వాత ఎన్నడూ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. తాను మోడీ విజన్‌ను ఎన్నడూ విమర్శించ లేదని కేవలం ప్రజల సెంటిమెంటు కోసమే ప్రత్యేక హోదాపై విమర్శ చేశానని సంజాయిషీ ఇచ్చుకు న్నారు. చంద్రబాబును జగన్‌ అరెస్టు చేయడం వెనక కేంద్రం ఆశీస్సులున్నాయని స్పష్టంగా తెలిసినా హోం మంత్రి అమిత్‌షాను ఆశ్రయించడానికే పాకులా డారు. ఆయన బహిరంగంగా మద్దతునివ్వకపోయినా బీజేపీతో పొత్తు కలుపుకోవడానికే ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించి నట్టు కూడా సంకేతాలు అందుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్న మాట.
తెలంగాణ ఎన్నికల తర్వాత..
తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న జనసేనను లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏక పక్షంగా వదిలేసింది. టీడీపీ పోటీ చేయకపోయినా తాను దాంతో కలసి పోటీ పెట్టి దెబ్బతిన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా ఏపీలో ఆ బీజేపీ ఆశీస్సుల కోసమే ఆరాటపడ్డారు. మరోవైపు తెలంగాణలో వైసీపీ పెట్టిన షర్మిల కాంగ్రెస్‌తో కలసిపోవడానికి చర్చలు జరి పారు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు గనక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కర్నా టక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తోనూ చర్చలు జరిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆమె రాకను స్వాగ తించలేదు. ఆమె కూడా ఆయన నాయకత్వాన్ని బల పర్చలేదు. ఆ విధమైన ప్రతిష్టంభన తర్వాత హఠా త్తుగా తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఆగ్రహం తో ప్రకటించారు. మళ్లీ ఇంతలోనే తమ పార్టీ పోటీ చేయబోదని వెనక్కుతగ్గారు. కానీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నది లేదు. కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత కూడా తాను రేవంత్‌ కోసం మద్దతునివ్వ లేదని ప్రత్యేకంగా ప్రకటించారు. అందుకు తగినట్టే కాంగ్రెస్‌ నాయకత్వం కూడా షర్మిల పాత్రను ప్రస్తా వించింది లేదు. నిజానికి షర్మిల రాజకీయాల్లో ప్రవేశి స్తారని ముందుగా చెప్పింది, ప్రధానంగా ప్రోత్సహిం చింది టీడీపీ అనుకూల మీడియానే. ఏపీలో జగన్‌ వ్యతిరేక పోరాటంలో ఆమె వుండటం ఉపయోగమన్న అంచనాతోనే వారు వివేకానందరెడ్డి కుమార్తె సునీ తనూ, షర్మిలను ప్రత్యేకంగా వార్తలలో నిలిపారు. తెలంగాణలో ప్రభుత్వ మార్పు తర్వాత ఆమె ఏపీకి వస్తారనే కథనాలు ఈ క్రమంలోనే వచ్చాయి. ఇంతవరకూ ఆమె వాటిపై స్పందించింది లేదు గాని ఖండించనూ లేదు. ఏపీ కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీవెళ్లి కాంగ్రెస్‌ అధిష్టానంతో సమావేశమై చర్చలు జరిపిన తర్వాత దాదాపు ఇదే ధృవపరిచారు. అయితే ఆమె ఏ సమయంలో వస్తారు, అధ్యక్ష పదవి ఇస్తారా వంటివే ఇప్పుడు తేలవలసి వుంటుంది. షర్మిల ఏపీలో ప్రవేశిం చడం సీఎం జగన్‌కు ప్రతికూల పరిణామమైనా ఆమె ఆయనపై ఏ విధంగా పోరాడతారో చూడవలసిందే. ఇదే సమయంలో వైసీపీలో టికెట్ల దుమారం మొదలైంది గనక బయటకు వచ్చేవారిలో కొందరు ఆమె నాయకత్వంలో చేరవచ్చని అంచనాలున్నాయి. మంగళగిరి ఎంఎల్‌ఎగా వైదొలగిన ఆర్కే ఆ మేరకు ప్రకటన చేశారు కూడా. జగన్‌ వ్యతిరేక ఓట్ల చీలికకు ఇది ఎంతోకొంత కారణమవుతుందని టీడీపీ వ్యూహ కర్తలు భావిస్తున్నారు. అదెవరికి ఉపయోగమనే చర్చ కూడా నడుస్తున్నది.
ఎవరి పాత్ర ఏమిటి?
బీజేపీతో టీడీపీ కలిసేట్టయితే సీపీఐ కూడా వారితో విడగొట్టుకోక తప్పదని పరిశీలకులు భావిస్తు న్నారు. తాము కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తామని మరో సందర్భంలో సీపీఐ నేత ఒకరు సూచనగా అన్నారు. వామపక్షాలతో కలసి వెళతామని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. బీజేపీ తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిసే ఎవరితోనూ తమకు సంబంధం వుండ బోదని సీపీఐ(ఎం) ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది, తమతో పొత్తుపై టీడీపీ కావాలనే ఎక్కువగా చెబుతున్నదని, ఇంకా నిర్ణయం జరగలేదని బీజేపీ నేత లు కొందరంటున్నారు. ఇంకా చాలా మార్పులు చూడవలసి వుంటుందని జనసేన ఆఫీస్‌ బేరర్‌ ఒకరు జోస్యం చెప్పారు. బీజేపీ మాట ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేయబోమని మాత్రం టీడీపీ తేల్చి చెబుతున్న విషయం.షర్మిల టీడీపీ నేత లోకేశ్‌కు క్రిస్మస్‌ కానుక పంపడం, ప్ర శాంత్‌కిశోర్‌ చంద్రబాబును కలవడంపై మీడియా హైప్‌ ఎక్కువగా వచ్చింది తప్ప తమ విధానంలో మార్పు వుండ దని వారంటున్నారు. ఈ లోగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్‌ నేషనల్‌ పార్టీ అంటూ స్థాపించి ప్రత్యేక హోదా ను కీలక ఎజెండాగా ప్రకటించారు. మొదటి కార్యక్ర మంగా వాజ్‌ పేయి జయంతి జరిపారు! ఈ చిన్న పెద్ద విభిన్న రాజకీయశక్తుల వైఖరి ఎలావుండేది ఎన్ని కల ప్రకటన తర్వాతనే స్పష్టమవుతుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఇటీవల వ్యాఖ్యానిం చినట్టు వైసీపీపై అసంతృప్తి, తెలుగు దేశంపై పూర్తి విశ్వాసం లేకపోవడం ఏపీ రాజకీయాల్లో ప్రధానాం శాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ముగిసినప్పటికీ లోక్‌సభ పోటీ కాంగ్రెస్‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్రంగానే వుండవచ్చు. వచ్చే ఎన్నికల్లో తమకు 330 వరకూ స్థానాలు వస్తా యని బీజేపీ చెబుతున్నా ‘ఇండియా’ వేదిక పార్టీలు కలసి కట్టుగా విసిరే సవాలు విసురుతున్న నేపథ్యం లో దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలని వ్యూహాలు రచి స్తున్నది. ఈ పూర్వ రంగంలో ఏపీ, తెలంగాణ లలో ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఛాయల్లోనే కొనసా గడం రాష్ట్రాలకు దేశంలో ప్రజా స్వామ్యానికి కూడా నష్టం కలిగించే విషయం. తెలంగాణలో కాంగ్రెస్‌ కూ డా బీజేపీపై రాజకీయ సైద్ధాంతిక పోరాటం పదును పెంచవలసే వుంటుంది. అనేక రాష్ట్రాలల్లో ఆ పార్టీ తన స్థానిక ప్రత్యర్థులపై ఎక్కుపెట్టినంతగా బీజేపీ మతతత్వంపై పోరాడాలని భావించడం లేదు. పెద్ద పార్టీగా లౌకికశక్తుల ఐక్యత కోసం తగినంత కృషి చేయ డమూ లేదు. మరో మూడు నాలుగు రోజుల్లో ‘ఇండియా’లో సర్దుబాట్లు పూర్తవుతాయని చెబుతున్న దృష్ట్యా ఏం జరుగుతుందో చూద్దాం.
తెలకపల్లి రవి