సంస్కృతి ప్రదర్శనలో పథకాలు సాధించిన విద్యార్థులకు రిజిస్ట్రార్ అభినందనలు

నవతెలంగాణ – డిచ్ పల్లి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో  జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్  కీ తెలంగాణ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు సంస్కృతిక ప్రదర్శనలలో  పాల్గొని బహుమతులు అందుకున్నందుకు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి  విద్యార్థులను అభినందిస్తూ తెలంగాణ వర్సిటీ ప్రఖ్యాతను దేశ నలుమూలల తెలిసేలా విజయ యాత్ర కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్  కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి,  ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్,  వెంకటేశ్వర్లు, అభినందనలు తెలిపారు విద్యార్థులు  బ్రహ్మానంద్,  వెంకటేష్,  దన్నియల్,  శరత్ కుమార్,సుమిత్ర , శంకు, అఖిల, సోనియా ఉన్నారు.