– ఆగ్రహం వ్యక్తం చేసిన నూతన కమిటీ అధ్యక్షులు, సభ్యులు
– సమావేశానికి గైరాజరైన నలుగురు సభ్యులు
నవతెలంగాణ – కామారెడ్డి
సీతారామాంజనేయ గుడి స్థలాన్ని ట్రస్ట్ కు రిజిస్ట్రేషన్ చేయడం సరైన పద్ధతి కాదని రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు అన్నారు. ఈ విషయంపై శుక్రవారం సీతారామాంజనేయ ఆలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఐదుగురు మాత్రమే కలిసి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, నూతన ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షులపై అతనితో పాటు ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నూతన కమిటీ సభ్యులతోపాటు భక్తులు శుక్రవారం ఆలయ కమిటీలో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఈ సమావేశానికి ఆహ్వానించగా వారు హాజరుకాలక పోవడంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీతారామాంజనేయ దేవస్థానం న్యాయ సలహాదారులు లాయర్ సీతారాములు, లాయర్ నాగభూషములు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ అధికారి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని, కమిటీ సభ్యులను భక్తులను సంప్రదించకుండా ట్రస్ట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని, ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు గుడి కి సంబంధించిన స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని అన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని శుక్రవారం సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి కేవలం పూర్వ అధ్యక్షులు సేర్ల రాములు మాత్రమే హాజరై మిగిలిన నలుగురు రాకపోవడంపై కమిటీ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గుడి ఏ ఒక్కరి సొత్తు కాదని ఎవరు సేవ చేసినా సేవగానే గుర్తించాలని వార్డు సభ్యులు మోటూరి శ్రీకాంత్ అన్నారు. గత 25 సంవత్సరాలుగా సేర్ల రాములు అధ్యక్షులుగా కొనసాగుతూ గుడికి సంబంధించిన వివరాలని అయిన వద్దనే ఉన్నాయని, గత మూడు నెలల క్రితం నూతన కమిటీని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం అయి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి లెక్కలు చూపకపోవడం, అలాగే నిల్వ ఉన్న డబ్బులను నూతన కమిటీకి ఇవ్వకపోవడం ఏమిటని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వెళ్లి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని సెర్ల రాములకు కమిటీ సభ్యులు సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ముఖ్య సలహాదారులు అలిమీ శెట్టి లక్ష్మరాజం, ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ అశోక్ గుప్త, కార్యదర్శి నాగేల్లి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి తమ్మి శ్రీనివాస్ గుప్తా, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.