‘శంబాల’ రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..

'శంబాల' రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళి థ్రిల్‌ చేసేందుకు ‘శంబాల’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యుగంధర్‌ ముని దర్శకత్వంలో ఆది సాయి కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో జియో సైంటిస్ట్‌గా ఆదిసాయికుమార్‌ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభం అయింది. అర్చన అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా, సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఇది వరకెన్నడూ టచ్‌ చేయని పాయింట్‌తో ఈ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మాతలు రాజశేఖర్‌ అన్నభీమోజు, మహిధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. విజువల్స్‌, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్‌ మద్దూరి ఆధ్వర్యంలో నేపథ్య సంగీతంలోనూ కొత్త మార్క్‌ క్రియేట్‌ చేసేందుకు మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు.