– ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు రాజేష్
నవతెలంగాణ-ఖానాపూర్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల పెండింగ్ బకాయిలు విడుదల చేయడం హర్షనీయమని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులందరినీ యుద్ధ ప్రాతిపదికన క్రమ బద్దీకరించాలని, పీఎఫ్, ఈఎస్ఐలను వర్తింపజేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె చేసిన నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. సమ్మె సందర్భంగా కాంగ్రెస్ పంచాయతీ కార్మికులకు సంపూర్ణ మద్దతు పలికి అధికారం చేపట్టగానే సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం లింగన్న, డివిజన్ నాయకులు మలవత్ జేవింధ్, మద్దినేని చిన్న రాజన్న, ముంజం దేవేందర్ పాల్గొన్నారు.