– రెండు వారాలలో పూర్తి చేస్తాం
– చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-యాలాల
రెండు వారాల్లో జుంటుపల్లి తూముల మరమ్మతు పనులను పూర్తి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం యాలాల మండల పరిధిలోని జుంటుపల్లి ప్రాజెక్టును ఎంపీపీ బాలేశ్వరగుప్తాతో కలిసి ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రాజెక్టు తూము పనులను రెండు వారాల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడి చెరువు నిండితే తూము నిర్మాణ పనులను చేయలేమన్నారు. తూము నిర్మాణ పనులు వేగవంతంగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జుంటుపల్లి ప్రాజెక్టు తూమునిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యే విధంగా త న సహాయ సహకారాలు అందిం చడం సంతోషంగా ఉందన్నా రు. ఎమ్మెల్యేతో సమన్వయ పరుచుకుంటూ అభివృద్ధి ప నుల్లో ముందుకు వెళ్తామన్నారు. అం తకు ముందు జంటుపల్లి సీతారా మ చం ద్రస్వామి దేవాలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్, అంబటి కాశీనాథ్, పెండ్యాల లక్ష్మీకాంత్, శంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, అక్కంపల్లి రమేష్, డీఈ కిష్టయ్య, ఏఈ నవీన్ కుమార్, గ్రామస్తులు, పాల్గొన్నారు.