బీఆర్ఎస్ కు షాక్.. మండల అధ్యక్షుని రాజినామా..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చింత శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంటు తారక రామరావు, జిల్లా అద్యక్షులు అశన్నగారి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూలర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు రాజీనామా పత్రాన్ని పంపించినట్లు వివరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ డిచ్ పల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని నా వ్యక్తి గత కారణాల వలన మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామను ఆమోదింపవలసిందిగా కోరుతున్నానని లేఖా లో పేర్కొన్నారు‌. ప్రస్తుతం మెంట్రాజ్ పల్లి సహకార సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా పార్టీ లో ఉంటు రాజీనామా చేయడంతో పార్టీ కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.