అన్నపూర్ణ స్టూడియోస్, చారు బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ను తెలుగులో ‘బార్సు హాస్టల్’ పేరుతో గ్రాండ్‌గా విడుదల చేశాయి. ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ‘స్టూడెంట్ ఫిల్మ్ అఫ్ ది ఇయర్’గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నిర్మాత సుప్రియ మాట్లాడుతూ,’మంచి కంటెంట్ ఎక్కడున్నా ఆదరించడం తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత. ‘హాస్టల్ బార్సు’ చిత్రంతో అది మరోసారి రుజువైంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రమిది. థియేటర్‌లో ప్రేక్షకుల నవ్వులు చూస్తున్నపుడు వచ్చే తప్తి వేరు. అలాంటి గొప్ప తప్తి, మజాని ఇచ్చిన చిత్రమిది’ అని తెలిపారు.
‘ఈ సినిమాని ప్రేక్షకులు, ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ ఆదరిస్తున్న తీరు నెక్స్ట్ లెవల్‌లో ఉంది. థియేటర్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలోనే ఇలాంటి సినిమా రాలేదు. యూత్ చాలా ఎంజారు చేస్తున్నారు. మంత్ ఎండ్ కావడంతో స్టూడెంట్స్‌కి పాకెట్ మనీ ఇష్యూ వస్తుంది. అందుకే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన థియేటర్స్ జాబితా రిలీజ్ చేస్తాం’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు.