సత్య దేవ్ హీరోగా ’47 డేస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్‌గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్‌కి దర్శకత్వం వహిం చారు. ఇటీవల ఆహాలో విడుదలైన ఈ సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుని విశేష ఆదరణతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ, ‘మాది రాజమండ్రి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన పూరి జగన్నాధ్ దగ్గర ఐదేళ్లు పనిచేసాను. తర్వాత ’47 డేస్’తో దర్శకుడిగా మారాను. ‘సర్వం శక్తి మయం’ లాంటి చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్టుని చేయడం చాలా పెద్ద బాధ్యత.
బివిఎస్ రవి ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చి, వెంటనే చేస్తానని చెప్పాను. అయితే ఇంత స్పిరిచ్యుల్ సబ్జెక్టు చేయడానికి కారణం ఇంకొకటి ఉంది. మాది ఆర్దోడాక్స్ ఫామిలీ. అలాగే ఈ సిరీస్ కోసం ప్రియమణి, సంజరు సూరి, సమీర్ సోని, ఆశ్లేష ఠాకూర్… లాంటి మాకు అద్భుతమైన నటులు దొరికారు. అమ్మవారి శక్తి పీఠాల కథ ఇందులో చెప్పాం. జీ 5లో హిందీలో జూన్ 9న, అహాలో తెలుగు, తమిళంలో అక్టోబర్ 20న విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కతజ్ఞతలు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’ అని అన్నారు.