ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ని రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ,’నిన్న శ్రీరాములు థియేటర్, ట్రిపుల్ ఏ లో ప్రీమియర్స్ హౌస్ ఫుల్ షోస్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. క్రౌడ్ రెస్పాన్స్ అదిరిపోయింది. కామెడీ, ఎమోషన్స్‌కి అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన మా అమ్మ క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది. మహిళా ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందరి నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది’ అని తెలిపారు. ”ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎక్కువమంది ఫ్యామిలీ ఆడియెన్స్, అమ్మాయిలు సినిమాని, దర్శితో నా కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు’ అని హీరోయిన్ నభా నటేష్ చెప్పారు. డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ,’మేము ఊహించినట్లే ఆడియెన్స్‌కి ఈ సినిమా అద్భుతంగా రీచ్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ బాగా ఇష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఫ్యామిలీ, మహిళా ప్రేక్షకులు మా ‘డార్లింగ్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.