సూర్యాపేట జిల్లా బాధ్యతలు అర్ డి అర్ కే అప్పగించాలి

నవ తెలంగాణ – మద్దిరాల:
  త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల లో తాను పోటీ చేసే సూర్యాపేట నియోజక వర్గం తో పాటు, జిల్లా లోని అన్ని నియోజక వర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించగల చరిష్మా  ఉన్నా ఏకైక నాయకుడు దామోదర్ రెడ్డి అని. సూర్యాపేట జిల్లా బాధ్యతలు మాజీ మంత్రి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఖాయమని ప్రముఖ విద్యావేత్త జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగెల్లి అరుణ్ కుమార్ అన్నారు.గురువారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏకైక కరడు గట్టిన కాంగ్రెస్  వాది దామోదర్ రెడ్డి అని జిల్లా మొత్తంలో పార్టీ పై మంచి పట్టున్న ఏకైక నాయకుడు దామోదర్ రెడ్డి అని మూడు తరాల నుండి తాను తన కుటుంబం కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన మహా నేత అని వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మి పార్టీ అభివృద్ధికి కర్చు చేసిన నిక్కరసు అయిన నాయకుడని కొనియాడారు.1985లో టి డి పి ప్రభంజనం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యే ల లో ఒకరు రాం రెడ్డి దామోదర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అడుగు జాడల్లో నడిచిన ఏకైక సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి అని అలాంటి నాయకునికి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలతో బీ అర్ యస్ పార్టీ నాయకుల్లో  గుబులు మొదలైందని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీ అర్ యస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని,  రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉబీద్యోగులు, ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి కానుక ఇవ్వాలని ప్రజలందరికీ  పిలుపునిచ్చారు.