– నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేసిన అదనపు కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
గత కొద్దిరోజులుగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం విరమించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నేతన్నల సమస్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావుతో కలిసి చర్చించిన అనంతరం అదనపు కలెక్టర్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో దీక్ష స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నేతన్నలకు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల వస్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. పరిశ్రమ తరపున ఇచ్చిన డిమాండ్స్ ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు.