వలస జీవుల తిరుగు ప్రయాణం

వలస జీవుల తిరుగు ప్రయాణం– స్వగ్రామాలకు చెరుకు నరికే కార్మికులు
నవతెలంగాణ- లింగంపేట్‌
పొట్టకూటి కోసం ఊరు.. ఇల్లు వదిలి రెండు నెలల కిందట చెరుకు నరికే పనికొచ్చిన కూలీలు తిరిగి ఇంటిదారి పట్టారు. కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో గల గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీ వారి ఒప్పందం మేరకు చెరుకు నరికేందుకు నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌, కర్నాటక రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి వలస కార్మికులు నవంబర్‌ నెలలో కామారెడ్డికి వచ్చారు. నారాయణ్‌ఖేడ్‌ డివిజన్‌ సిర్గాపూర్‌ మండలంలోని 20 గిరిజన తండాల నుంచి సుమారు 150 కుటుంబాల వరకు చెరుకు నరికే పనిలో నిమగమవుతాయి. సుమారు 2000 మంది కార్మికులు వలస వచ్చి షుగర్‌ ఫ్యాక్టరీ పరిసరాల్లో చెరుకు నరికే పనిలో మూడు నెలలపాటు పని చేశారు. ప్రస్తుతం సీజన్‌ పూర్తి కావడం స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎడ్లబండ్ల మీదే వారి ప్రయాణం సాగుతుంది.