– బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు గెల్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాేష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నదని బీఆర్ ఎస్‌వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. మంగళవారం హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ సీఎం కాక ముందు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యో గాలు ఖాళీ ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. వాటిని అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారని తెలిపారు. ఇంత వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.కొత్తగా విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉందని ఆరోపించారు. గ్రూప్ 2 పరీక్షలను వెంటనే పెట్టాలనీ, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు.