శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో వెలసిన ఉమామహేశ్వరం దేవాలయం ఉండి లెక్కింపు శనివారం దేవాలయం ఆవరణలో నిర్వహించారు. గత ఏప్రిల్ 3 నుంచి 26 అక్టోబర్ వరకు మొత్తం 6 నెలల 23 రోజులకు గాను రూ. 9 లక్షల 90 వేల 285 ఆదాయం వచ్చిందని దేవాదాయ పాలక మండలి ఛైర్మన్ భీరం మాధవ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ నాగర్ కర్నూలు జిల్లా పరిశీలకులు వెంకటేశ్వరమ్మ , పాలక మండలి సభ్యులు, ఈఓ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.