నవతెలంగాణ – మల్హర్ రావు
సమాచార హక్కుచట్టం సామాన్య ప్రజలకు వజ్రాయుధం లాంటిదని ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. మంగళవారం, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ 19వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 సంవత్సరాల అడుగుపెడుతున్న నేపథ్యంలో కేక్ కట్ చేసి,స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సమాచార హక్కు చట్టం 2005లో అమలులోకి వచ్చి 20 సంవత్సరాల్లో అడుగుపెట్టిందన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పెట్టాలని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా అధికారులు పనులు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టాన్ని,గత ప్రభుత్వంలో కమిషన్ నియమించి తూతూమంత్రంగా నిర్వర్తించారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అర్జీ పెట్టుకున్న జాప్యం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమాచార కమిషనర్ను నియమించాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పదవ తరగతి పుస్తకంలో సమాచార హక్కు చట్టాన్ని, పాఠ్య అంశాలలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం విజయందర్ కాశబోయిన, రమేష్ పసరగొండ,రాజేందర్ ,రాజు గ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్ మాజీ సర్పంచ్ వీరన్న ,రాజు రాజయ్య జంపయ్య రాకేష్ రమేష్ సురేష్ పాల్గొన్నారు.