
ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలను తీసుకోవాలని, తమ పరిధిలోని రూట్ మాపులపై అవగాహన ఉండాలని, సెక్టోరియల్ అధికారుల విధి విధానాల హ్యాండ్ బుక్స్ లోని నియమాలను, మార్గదర్శకాల పట్ల క్షుణంగా అవగాహన కలిగి వుండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలా, ఓటింగ్ శాతం పెరిగేలా స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.
పోలింగ్ విధానంలో రిటర్నింగ్ ఆఫీసర్ కు ప్రిసైడింగ్ ఆఫీసర్ కు మధ్య అనుసంధానకర్తగా సెక్టోరియల్ అధికారి ఉంటారని, వారి ఆధీనంలో 12 పోలింగ్ కేంద్రాల వరకు ఉంటాయని, వాటిని పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వల్నరబుల్ మ్యాపింగ్ చేయాలని, ఎథికల్ ఓటింగ్ చేయించాలని, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్న చోట తరచూ సందర్శించాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బూత్ లెవల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కలిగించేలా పని చేయాలని, గత ఎన్నికలలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్న పోలింగ్ కేంద్రాల పట్ల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, సివిల్ మేజర్ చేయడం, ఆ పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ చేయడం జరుగుతుందని, మైక్రో అబ్సర్వర్లను నియమించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా వినియోగించుకునేలా కార్యాచరణ ఉండాలని తెలిపారు. పోలింగ్ సజావుగా జరుగాలంటే పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు తప్పనిసరిగా కల్పించాలని, ప్రతి సెక్టోరియల్ అధికారి తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని మూడు సార్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ర్యాంప్, మంచినీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నీచర్, టాయ్లెట్స్ తదితర వసతులు ఉండేలా క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కోసం కోసం సరైన విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు.
ఓటరు టర్న్ అవుట్ మీద శ్రద్ధ పెట్టాలని, ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ వంద శాతం పంపిణి అయ్యేలా చూడడం, పోలింగ్ రోజున చేయవలసిన పనులు, ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు తేవలసిన 12 రకాల గుర్తింపు కార్డులపై ప్రచారం, పోలింగ్ స్టేషన్ లోపల, బయట చేపట్టవలసిన నిబంధనలు, ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు, ఎన్నికల రోజున తమకు కేటాయించిన రూట్ల పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తహసిల్దార్లు, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని, ఈవీఎంలలో సమస్య తలెత్తితే రిజర్వు ఈవీఎంలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ముఖ్యంగా పోలింగ్ రోజు జరిగే పోలింగ్ విధానంపై పూర్తి పట్టు ఉండాలని అన్నారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్ కోసం ఫామ్ 17-సి పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వాలని, ఇవిఎం యంత్రాలపై అవగాహన, సీలింగ్ చేసే విధానంపై అవగాహన పొందాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఇచ్చే ఫారములు, కవర్స్, మెటీరియల్స్, మాక్ పోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధానంపై, ఇవిఎం యంత్రాలలో క్లోజ్, రిజల్టు, క్లియర్ వ్యవస్థలపై, వీవీప్యాట్ లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై, పోల్ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లలో ట్రబుల్ షూట్స్ పై అవగాహన పొందాలని, పోలింగుకు 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు, ఓటింగు గోప్యత కాపాడాలని తెలిపారు. పోలింగ్ సందర్భంలో వచ్చే టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు, టెస్ట్ ఓట్లపై అవగాహన పెంచుకోవాలని, పోలింగ్ పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో క్లోజ్ బటన్ పోలింగ్ ఏజెంట్ల ముందు చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వంద శాతం ఎన్నికల కమీషన్ నిబంధనలను పాటించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి సెక్టార్ ఆఫీసర్లకు రెండవ విడత శిక్షణా కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.