ఓటుహక్కును ప్రతి ఎన్నికలో వినియోగించుకోవాలి

– అదనపు కలెక్టర్ శ్యామలదేవి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు దాన్ని ప్రతి ఎన్నికల్లో వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామల దేవి అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగాంగా ఓటరు నమోదుపై అవగాహన కల్పించేల తెలంగాణ సోషల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సహంగా పాల్గొని రంగు రంగు ముగ్గులను వేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఓటరు నమోదుపై అదనపు కలెక్టర్ అవగాహన కల్పించారు. కాగా రంగోలిలో గెలుపొందిన వారికి త్వరలోనే బహుమతులను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామల దేవి మాట్లాడుతూ… మంచి నాయకత్వాన్ని ఎన్నుకొడానికి రాజ్యంగం ద్వారా ఓటు హక్కు వచ్చిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలోనే నమోదు ఉంటుందన్నారు. గత సంవత్సరం ఎన్నికల సంవత్సరం కావడంతో నాలుగు సార్లు నమోదుకు అవకాశమిచ్చారన్నారు. కొత్త నమోదుకు ఫాం6, తొలగింపుకు ఫాం 7, మార్పులు చెర్పులు ఫాం 8 ద్వారా చేసుకుకోవచ్చన్నారు. ఈ విషయని ఇతరులకు కూడా విద్యార్థులు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్, వైప్ ప్రిన్సిపల్ కీర్తి అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.