
నవతెలంగాణ- నెల్లికుదురు
బాలికలు తమ హక్కులను తెలుసుకొని ప్రతి ఒక్క బాలిక హక్కులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ నలమాస అరుణ అన్నారుమండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో బాలికల హక్కుల గురించి వారి వ్యక్తిగత పరిశుభ్రతపై సంబంధిత శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని శనివారం సమావేశాన్ని నిర్వహించి అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో కార్యాలయంలో ఐకెపి వెలుగు కార్యాలయంలో భేటీ బచావో బేటి పడావో కు సంబంధించిన పోస్టులను కార్యాలయానికి అతికించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ తరంగిణి ఎంపీఓ పార్థసారధి అంగన్వాడి సూపర్వైజర్లు మాట్లాడారు బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు వారి హక్కులను వారు పొద్దున్నే చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు ఈనెల 24న జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాల నిర్వహిస్తున్నామని తెలిపారు బాలికలకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే వెంటనే సంబంధిత టీచర్కు గాని పోలీసులకు గాని లేదా మాకు గాని ఫోన్ చేయవచ్చు అని అన్నారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రములో బాగముగా అమ్మాయిలకి శానిటరి నాప్కిన్స్ పంపిణీ చేయడము జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురలు రమాదేవి, ఐసిడిఎస్ సూపర్వైసర్ మల్లేశ్వరి, ఉష రాణి, విజయలక్ష్మి, నాగమణి, హెచ్ ఈ ఓ వెంకటేశ్వరల్లు , సి హెచ్ ఓ శాంతా, విమలా, మహిళా సాధికారత కేంద్రం స్టాఫ్ సంధ్యారాణి,రాకేష్ లు తదితరులు పాల్గొన్నారు.