మున్నూరు కాపు కులస్తుల హక్కులు వెంటనే అమలుపరచాలి

The rights of Munnuru Kapu caste should be implemented immediately– మౌన దీక్ష నిరసన కార్యక్రమంలో మున్నూరు కాపులు

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్నూరు కాపుల హక్కుల సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపుమేరకు ఆదివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సంఘం కార్యవర్గం ఆధ్వర్యంలో మౌన దీక్ష నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు సారంగులవార్ గంగారం మాట్లాడుతూ.. మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించి మున్నూరు కాపు హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ మౌన దీక్ష నిరసన ఆందోళన కార్యక్రమంలో మద్నూర్ మండల కేంద్ర మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు అనుము వార్ హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి సందూర్వార్ హనుమాన్లు, కోశాధికారి థైదల్ చందర్, కమిటీ సభ్యులు టి రామ్ కిషన్, అంజయ్య, తుమ్ రాములు, మాలే శివరాం పాకల విట్టల్, బంకల హనుమాన్లు, నాగం ప్రకాష్, వడ్డే గంగాధర్, మనూర్ గంగాధర్, వడ్డే హనుమాన్లు, హనుమాన్లు, గంగాధర్, ఈ మౌన దీక్ష నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.