ఉప్పొంగి పారుతున్నా వాగు

– తాళ్ళ సహాయంతో బ్రిడ్జ్ దాటుతున్న కూలీలు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలో గత కొన్ని రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షలతో వాగులు వంకలు ఉద్రిక్తంగా పొంగిపొర్లుతున్నాయి.గురువారం నాడు కురుస్తున్న భారీ వర్షం తోఎగువ భాగం నుండి వస్తున్న నీళ్లతో  పోచారం తాండ ,పోచారం గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉద్రిక్తంగా మారడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది.దింతో  వరి నాట్లు వేసే కూలీలు తాళ్ల సహాయంతో బ్రిడ్జ్ దాటుతున్నారు.