పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్డు..

– రాకపోకలకు తీవ్ర అంతరాయం
– ఆవస్థలు పడుతున్న 150 మంది రైతు కుటుంబాలు
– అధికారులు, నేతలు పట్టించుకోవలని వేడుకలు
నవతెలంగాణ-ఉప్పునుంతల : చినుకు పడితే చిత్తడిగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి సుమారు 150 మంది రైతు కుటుంబాలకు కత్తి మీద సాములా మారింది ఆ రోడ్డు.ఉప్పునుంతల మండలంలోని జప్తి సదగోడు గ్రామం నుండి మర్రిపల్లి లింక్ రోడ్డు పరిస్థితి ఇది. గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోవటంతో ఎడతెరిపిలేని ముసురు కు ఆ రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం అధికంగా గుంతలు ఏర్పడి రాకపోగాలకు తీవ్ర అంతరాయం ఏర్పడితే రైతులే సొంత ఖర్చులతో మట్టిని పోసుకొని రాకపోకలు సాగించారు. కానీ వర్షాల కారణంగా మళ్ళీ అదే విధంగా మారి రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఏర్పడిందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నేతలు చొరవ తీసుకొని రోడ్డును బాగు చేసి రాకపోకలకు అనువుగా చర్యలు చేపట్టాలని రైతులు కొట్టం శేఖర్ యాదవ్,కొట్టం పెద్ద వెంకటయ్య యాదవ్,అల్వాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,నిరంజన్,జంగయ్య,తిరుపతయ్య,మల్లేష్,బాలేమియా,నషీర్,తిరుపతి రెడ్డి,లక్ష్మరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,రమేష్,పార్శారములు వేడుకుంటున్నారు.