రోడ్డు చిన్నగా.. బండ్లు ఏమో పెద్దగా..

Oplus_0

నవతెలంగాణ – బొమ్మలరామారం 

రోడ్లపై అధిక లోడుతో ఉన్న లారీలు యధేచ్చగా తిరుగుతున్నాయి. ఇలాగైతే ప్రమాదాలు జరగవా.? అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అసలే రోడ్డు దుస్థితి అద్వానంగా తయారయ్యాయి. ఇంకా ఈ రోడ్డుపై అధిక లోడుతూ ఉన్న లారీలు వెళ్తుడంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. బొమ్మలరామారం మండలం చీకటిమామిడి నుండి మర్యాల గ్రామం వరకు ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి మరి దారుణంగా ఉంది.చుట్టుపక్కల ఇటుక బట్టీలు ఉండడంతో అధికలోడున్న ఉన్క పొట్టు లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, అవి వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే వాహనదారులకు కళ్ళల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని వాహనపుదారులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై అధిక రోడ్డుతో ఉన్న లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.