రోడ్డంతా జలమయం.. పరిష్కారం చూపరు..

– చెరువుల తలపిస్తున్న రోడ్డు..
– అనేక ఇబ్బందులూ ఎదుర్కొంటున్న ప్రయాణికులు..
– ఎన్ని సార్లు పరిశీలించిన పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..
– ప్రతి ఏడు ఇదే పరిస్థితి..
నవతెలంగాణ – మాక్లూర్
వర్షా కాలం వచ్చిందంటే అక్కడ రోడ్డుపై చెరువుల తలపిస్తూ పెద్ద కలువగా రోడ్డుపై కనిపిస్తుంది. ఎన్ని సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పరిశీలించిన ఈ సమస్యను పరిష్కరించారు. కొద్ది పాటి వర్షం వచ్చిందంటే రోడ్డంతా జలమయం అవుతుంది. వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మండలంలోని మాణిక్ బందర్ గ్రామ శివారులో గల 63వ జాతీయ రహదారిపై సుమారు అరకిలో మీటరు వరకు రోడ్డుపై వర్షపు నీరు పారుతుంది. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పరిశీలించి వెళుతున్నారు. కానీ పరిష్కార మార్గం చూపడం లేదు. గత సంవత్సరం మాణిక్ బండార్  కామన్ వద్ద బీహార్ కు చెందిన హమాలీ కులి కాలుజారి కాలువలో పడీ మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రయాణికులు, పాదచారులు ఎక్కడ నుంచి వెళితే ఏ గుతలో పడుతమొనని భయాందోళనలతో ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగ జేసుకొని జాతీయ రహదారి ప్రక్కన కాలువను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.