
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని తహాసిల్ కార్యాలయంలో బుధవారం ‘ కమ్యూనిటీ మీడియేటర్స్’ సర్టిఫికెట్లను తహశీల్దార్ ముజీబ్, డోంగ్లీ తహశీల్దార్ రేణుక చౌదరి చేతుల మీదుగా ఉడతవార్ సురేష్, విశ్రాంత ఏఎస్సై అశోక్ లకు అందజేశారు. ‘ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ‘ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో ఇటీవల నిర్వహించిన శిక్షణ శిబిరంలో మూడు రోజుల శిక్షణలో పాల్గొనడంతో సర్టిఫికెట్లను అందజేసినట్లు సురేష్, అశోక్ పేర్కొన్నారు. మద్నూర్ ఉమ్మడి మండలం నుంచి ఇద్దరు శిక్షణ తీసుకోవడం పట్ల తహసిల్దార్లు హర్షం వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం కోసం ‘కమ్యూనిటీ మీడియేటర్స్’ పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు.