ప్రజాస్వామ్యంలో ప్రతికల పాత్ర కీలకం

ప్రజాస్వామ్యంలో ప్రతికల పాత్ర కీలకం– స్థానిక సీఐ గుడి పవన్‌ కుమార్‌రెడ్డి, నాయకులు బూర్గు గోపిక్రిష్ణ రెడ్డి
నవతెలంగాణ-మొయినాబాద్‌
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని, పాలకులకు దిశా నిర్దేశం చేస్తూ ప్రజల మన్ననలను పొందాలని మొయినాబాద్‌ స్థానిక సీఐ గుడి పవన్‌ కుమార్‌ రెడ్డి, నాయకులు బూర్గు గోపిక్రిష్ణ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నవతెలంగాణ-2024 క్యాలెండర్‌ను సీఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి అధికారుల దృష్టికి సుకెళ్లేవి దిన పత్రికలేనని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారించడంలో పత్రిక పాత్ర కీలకపాత్ర పోషించాలని సూచించారు. నూతన ఓరవడితో ముందుకు దూసుకుపోతున్న నవతెలంగాణ దిన పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌సింగ్‌ ఎస్‌ఐ, వినోద్‌ జమిదార్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, పాల్గొన్నారు.