– డాక్టర్ అశోక్
నవతెలంగాణ- బడంగ్ పేట్
సమసమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, విద్య, విజ్ఞానం తోపాటు సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందని సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ బడంగ్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు శాస్త్రీయ ప్రణాళిక పునశ్చరణతో పరీక్షల్లో విజయం అనే అంశంపై డాక్టర్ పరికిపండ్ల అశోక్ అవగాహన కల్పించారు. బాలాపూర్ మండలంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సైకాలజిస్టుల సంఘం సహకారంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు మూడు నెలల పాటు నిర్వహించే రాష్ట్రవ్యాప్త ప్రేరణ కార్యక్రమన్ని ప్రారం భించి మాట్లాడారు. విద్యతోనే సమాజంలో గౌరవం-ముందడుగు సాధ్యమని, శాస్త్రీయ ప్రణాళిక -పునశ్చ రణతో పరీక్షల్లో విజయం సాధించవచ్చునని అన్నారు. విద్యార్థులు చదువుకునే వయసులోనే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం అభినందనీయం..
ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం అభినందనీయమ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదు వుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెం పొందించుట కోసం పరీక్షల్లో విజయం సాధిం చాలంటే అనే అంశంపై ఉచితంగా ప్రేరణ సదస్సులు నిర్వహిస్తు న్నామని, విద్యార్థులు, సంబంధిత పాఠశాల ప్రధానో పాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 9989310141ను సంప్రదించాలని చెప్పారు. విద్యార్థులు చదువుకునే పద్ధతులు, జ్ఞాపకశక్తి, మెలకు వలు, టెన్షన్ అధిగమించే మార్గాలను, జీవితంలో ఎదుర య్యే ఆటుపోట్లను ఎదుర్కొని సమస్యలను అధిగమించి ఎలా ముందుకు పోవాలని సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యా యులు కోరాని అర్జున్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమలో నిర్మల్ జిల్లా బోసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, సీనియర్ ఉపాధ్యాయులు జ్యోతి, రాజశేఖర్, అరుణ, వెంకటరమణారెడ్డి, వనజ, ప్రతాపరెడ్డి, సంగీత, సంతోష, హరికష్ణ, సూర్యప్రభ అంజయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.