నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవ సమాజంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు పేడదోవ పట్టి మాదకద్రవ్యాలకు బానిస కావద్దని బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోదని ఎక్సైజ్ సూపర్డెంట్ బి. సంతోష్ సూచించారు.జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారం చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు అనర్ధాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ లు బి. చాణక్య ఎ. కిషన్ రాకేష్, ఇన్స్పెక్టర్లు రాకేష్, బి. ప్రసాద్,మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నాంపల్లి, చండూరు, నకిరేకల్ ప్రధాన కేంద్రాలలో ఎక్సైట్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.