సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

– అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్ట్‌, హెచ్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ఇమ్మానియేల్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్ట్‌, హెచ్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ఇమ్మాని యేల్‌ అన్నారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ, వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు అందించే టీచర్‌ ఫర్‌ ఎక్సలెంట్‌ అవార్డును శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు జంగయ్య, పిల్లిగుండ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు బాలమణి, రేవతి హై స్కూల్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ గణేష్‌లకు ఇంటర్‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఇంటర్‌నేషనల్‌ ఇనిస్టూట్యూట్‌ ఆఫ్‌ హౌటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్‌నేషనల్‌ గ్లోబల్‌ ఎడ్జ్‌ స్కూల్‌ కోకాపేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్‌ డే సెలబ్రేషన్స్‌ కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎక్కువగా ప్రేమించేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగినపుడు ఎక్కువగా సంతోషించేది ఉపాధ్యాయులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబర్నోబోస్‌, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్‌ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.