పోలీసుల పాత్ర కీలకం

తెలంగాణ వచ్చిన తర్వాత పోలిస్‌ వ్యవస్థ పటిష్టం వరంగల్‌ సీపీ ఏవి రంగనాథ్‌
నవతెలంగాణ-వరంగల్‌
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలిస్‌ వ్యవస్థ మరింత పటిష్టంగా మారందని వరంగల్‌ సీపీ ఏవి రంగనాథ్‌ అన్నారు.వరంగల్‌ కమిషన రేట్‌ నుండి ఐడీ ఓసీ స్థలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం మట్టేవాడ ఏసీపీ బోనాల కిషన్‌ అధ్యక్షతన తెలంగాణ సురక్షా దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు పెట్రో బ్లూ కోర్ట్స్‌ వాహనాల, డాగ్స్‌ ప్రదర్శన, కవాతు నిర్వహించారు. కలెక్టర్‌ ప్రావీణ్య, ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ,డీసీపీ భారీ,ఆర్డీవో మహేందర్‌ జీ,ఎనమాముల మార్కెట్‌ చేర్మెన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌ మసూద్‌, హాజరయ్యా రు. తెలంగాణ వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థలో గుణాత్మక మార్పులు వచ్చా యని,ప్రెండ్లి పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉన్నామని సీపీ అన్నారు. ప్రజలతో, బాధితులతో ప్రెండ్లి గా ఉండి వారికి న్యాయం చేస్తున్నామన్నా రు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండి నేరస్తులను పట్టుకోవడానికి సులభంగా మారిందన్నారు దేశంలో ఉన్న మొత్తం సిసి కెమెరాల్లో 70శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. పోలీసు స్టేషన్లు కార్పొరేట్‌ స్థాయి బిల్డింగు ల మాదిరిగా మారాయని,లాకప్‌ డెత్స్‌ లేకుండా ఉండాలనే ఉదేశ్యం తో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్నామన్నారు. అనంతరం కలెక్టర్‌ ప ప్రావీణ్య మాట్లాడుతూ నేడు మనం ఏర్పాటు చేసుకున్న సురక్షా దినోత్సవ వేడుక ప్రాంగణం ఒక హిస్టారిక్‌ గ్రౌండ్‌ అన్నారు. ఒకప్పుడు మహిళా ఉద్యోగులు నైట్‌ షిఫ్ట్‌ చేసి ఇంటికి వెళ్ళాలి అంటే బయపడే వారని కానీ నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ పోలీస్‌ అంటే ఇలా ఉండాలనే విదంగా సమస్యల పరిష్కారానికి మార్గం చూపు తున్న పోలిస్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ వచ్చిన తరువాత మంచి వాహనాలు,గొప్ప టెక్నాలజీ,పోలీస్‌ ఆరోగ్య రక్షణతో పాటు అన్ని రకాలుగా తెలంగాణ సర్కారు సహకరిస్తుందన్నారు. మామునుర్‌ అదనపు ఏసీపీ కపాకర్‌, సీఐ మల్లేష్‌, మిల్స్‌ కాలనీ సీఐ శ్రీనివాస్‌, మట్టేవాడ సీఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాష్‌ ఘనంగా సురక్ష దినోత్సవం
నవతెలంగాణ – ములుగు
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలుస్తున్నారని రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాష్‌ ప్రశంసించారు.తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలలో భాగంగా 3వ రోజు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ నుండి బండారుపల్లి రోడ్డులో ఉన్న పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ వరకు సురక్షా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోలీస్‌ ర్యాలీ శోభాయ మానంగా సాగింది. రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాష్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. క్రిష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్‌ ఆలం, డిఎఫ్‌ఓ రాహుల్‌ జాదవ్‌, ఓఎస్‌ డి అశోక్‌ కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతిలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాష్‌ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు యావత్‌ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. కోవిడ్‌ సంక్షోభం సమయంలోను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి పోలీసులు వెన్నుముకగా నిలుస్తున్నారని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివద్ధి చెందాలంటే శాంతి భద్రతలు నెలకొని ఉండడం ఎంతో అవసరమని అన్నారు. అప్పుడే పర్యాటకపరంగా, పారిశ్రామికంగా పెట్టుబడులను ఆకర్షిం చేందుకు వీలు ఉంటుందన్నారు. నేటి సమాజంలో కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చోటు చేసుకుంటుండగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కుంటూ పోలీసులు సైతం నేరాల నియంత్రణకు విశేషంగా కషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం పోలీస్‌ శాఖకు అధునాతన సదుపాయాలను సమకూ రుస్తోందన్నారు. పెట్రో కార్స్‌, బ్లూ కోల్డ్స్‌, జిల్లా స్థాయిలోనూ కమాండ్‌ కంట్రోల్‌ స్టేషన్స్‌, షీ టీమ్స్‌, భరోసా సెంటర్స్‌ వంటివి శాంతిభద్రతల పరిరక్షణకు ఉప యుక్తంగా నిలుస్తున్నాయని అన్నారు. హరితహారం వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీసులు భాగస్వాములు అవుతున్నారని, పోలీసుల సేవలు గొప్పవని ప్రశంసించారు. అనంతరం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన సురక్ష దినోత్సవ సమావేశంలో జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, ఆయుధాల గురించి సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం అందరిని ఆకర్షించింది. పోలీసుల వివిధ విభాగాల్లో నిర్వహించిన విన్యాసాలను అతిథులు ఆసక్తిగా తిలకించారు. సాంస్కతిక సారథి కళాకారులు ఆటపాటలతో సభికులను అలరించారు. ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జెడ్పి సీఈఓ ప్రసన్న రాణి, డిపిఓ వెంకయ్య, డిడబ్ల్యూఓ ప్రేమలత, సబ్‌ రిజిస్టర్‌ తస్లీమా, ఏఎస్పీ సదానందం సీఐలు ఎస్సైలు సంబంధిత శాఖ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.