నవతెలంగాణ- నెల్లికుదురు
సమాజంలో మహిళల పాత్ర గొప్పదని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురులో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్, సీనియర్ అధ్యాపకులు ముక్కెర ప్రకాష్ బాబులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని,మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని, మహిళల అభివృద్ధితోనే కుటుంబాలు బాగుపడుతాయని చెప్పారు. మహిళలు ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల మహిళా ఉద్యోగులైన కొల్లిపాక స్పందన, కూంజా మంగమ్మలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ కక్కెర్ల రామ్మూర్తి, డివో నెలకుర్తి నాగిరెడ్డి, అధ్యాపకులు ముక్కెర ప్రకాష్ బాబు, దూపటి శ్రీనివాస్, భూక్య నాగేశ్వరరావు, కందికొండ బాబు, పెద్దూరి వెంకటేశ్వర్లు, కూన సతీష్, లడ్ మహేందర్ యనమాల సుధాకర్, దేశెట్టి యాకన్న అధ్యాపకేతర బృందం లక్ష్మణ్, గౌరీ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.