రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. ఈనెల 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రంలో హేమలతా లవణం వంటి కీలక పాత్ర పోషించిన నటి రేణు దేశారు మీడియాతో మాట్లాడుతూ, ‘హేమలతా లవణంది లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీ. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ డెకాయిట్‌లని కలిసి అనేక రీఫార్మ్స్ చేశారు. అలాగే జోగిని వ్యవస్థపై, అంటరానితనం పై పోరాటం చేశారు. హేమలత లవణం ఈ సినిమా ద్వారా యంగర్ జనరేషన్ ఆడియన్స్‌లో స్ఫూర్తిని నింపుతారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకతం. ఈ సినిమాతో దర్శకుడు వంశీ నేషనల్ లెవల్‌కి వెళ్తారు. అభిషేక్ నిర్మాణంలో పని చేయడం, రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. అన్నిటికంటే హేమలత లవణం పాత్ర పోషించడం నా అదష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ పాత్ర నాకు చాలా తప్తిని ఇచ్చింది. అలాగే నాలో చాలా మార్పు తెచ్చింది. అకీరాలో ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీలు ఉన్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న పవన్‌కళ్యాణ్, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ ఆశగా ఉంది’ అని చెప్పారు.