నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురవడంతో మండలంలోని జువ్వాడి బ్రాహ్మణపల్లి గ్రామంలో విపరీతమైన ఈదురుగాలులు వేయడంతో జువ్వడి బ్రాహ్మణపల్లి నాలుగు ఇండ్ల పైకప్పు రేకులు లేచిపోవడంతో పాటు వర్షానికి ఇంట్లో ఉన్న ధాన్యం ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా చెడిపోయాయి ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్ రూమ్ మంజూరుచేయాలని మాకుటుంబాల ను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలుఅధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు