స్థానిక ఎన్నికల్లో.. గులాబీ జెండా ఎగరాలి

– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి 
– మోసకారి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
– ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
– మండలాన్ని ఒక గ్రామంలో సంక్షేమమట
– ఇబ్రహీంపట్నం మండల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి 
‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి గులాబీ జెండా ఎగరేయాలి’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో రూ.470 కోట్ల అభివృద్ధికి  ప్రోసిడింగ్స్ ఇచ్చామని.. వాటిని కూడా వాడుకోకపోవడం వల్ల వెనక్కి పంపారన్నారు. ఇప్పుడున్న ఎంఎల్ఏ లక్ష రూపాయలు అభివృద్ధి పని చేయలేదన్నారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను పాలకరించే వాళ్ళు లేరని విమర్శించారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టారని.. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను నమ్మే పరిస్థితి ప్రజలు లేరన్నారు. రైతు భరోసా నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో 60లక్షల రైతులు ఉంటే.. కేవలం 21లక్షల మందికి మాత్రమే రైతు భరోసాను ఇచ్చారన్నారు. మిగిలిన 49 లక్షల మంది రైతులకు మొండి చేయి చూపిందని విమర్శించారు. వచ్చేది గడ్డు కాలమే.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పే పరిస్థితి లేదని విమర్శించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో దిక్కు లేదన్నారు. చైతన్యం కలిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలకులపై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు భాషల్లో నిలిచిపోయాయన్నారు. లక్ష రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైందని నిలదీయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినావ్ అతనితో స్నానాలు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి రెండు మండలాల్లో కార్యకర్తల సమావేశాలు పూర్తి చేసామని.. మరో రెండు మూడు రోజుల్లో అబ్దుల్లాపూర్మెట్, యాచారం మండలాలు విస్తృత స్థాయి సమావేశాలుగా పూర్తి చేయనున్నామన్నారు.  మహిళలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బుగ్గ  రాములు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేష్, మాజీ వైస్ ఎంపీపీ ప్రతాపరెడ్డి, టిఆర్ఎస్వి నియోజవర్గ అధ్యక్షులు నిట్టు జగదీష్, సర్పంచ్ ల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు బూడిద రాంరెడ్డి, సొసైటీ చైర్మన్లు వెంకటరెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు భరత రెడ్డి, జ్యోతి, శ్రీశైలం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, యువ నాయకులు మంద సురేష్ , ప్రసాద్ గౌడ్, భరత్ రెడ్డి ఉన్నారు.