
నవతెలంగాణ – భువనగిరి రూరల్
ఎన్ పీ ఆర్ డి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలంలోని రెడ్డి నాయక్ తండ గ్రామంలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షుడు సుర్పంగా ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ 6000 ఈ హామీను వెంటనే నెరవేరించాలనీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఉచితంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఉచిత విద్య వైద్యం అందించాలని 2016 ఆర్పిడి చట్టం ప్రకారం తీవ్రవైతల్యంతో బాధపడుతున్న వికలాంగుల సహాయకులకు 20వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి జిల్లా నాయకులు ఇస్లావత్ లింగా నాయక్ , కే అనసూయ, కే లింగ నాయక్, శివయ్య భీ లింగం, గుగులోత్ హీరాలాల్, జయమ్మ, భూక్య ఈరమ్మ, భూక్య రావుజి లు పాల్గొన్నారు.