– డీజిల్ ట్యాంకర్ బోల్తా – బస్సులో పది మందికి గాయాలు
నవతెలంగాణ-ఆత్మకూరు
ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీజిల్ ట్యాంకర్ డీకొీన్న సంఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ జెర్రిపోతుల వాగు వద్ద శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని 10మందికి గాయలయ్యాయి. స్థానిక సీఐ రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు నుంచి హన్మకొండకు వస్తున్న ఆర్టీసీ వరంగల్ -2 డిపోకు చెందిన బస్సును హన్మకొండ నుండి ములుగు వైపు అతివేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ డీకొీట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ ముందు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం 108లో వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. కాగా డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ రామచంద్ర ప్రశాంత్.. లారీని అతివేగంగా నడపడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ట్యాంకు మొత్తం డీజిల్‌తో నిండి ఉండటంతో విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. మంటలు చెలరేగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్ కండక్టర్ దొడ్డ సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.