రాలిపోయే శిథిలానివే

లెక్కించలేనంత వేదనల
కుంపటి సెగలకు
ఎన్నెన్నో ఉద్వేగ
ఉప్పెనలై ఉప్పొంగేనో
ఎన్నెన్నో అశ్రు దారాలు.
పుడమి ఎదలో ఇంకిపోయనో

ఎన్నెన్నో శ్రమ వేదనలు
కాలగర్భంలో కలిసిపోయెను
కాల పరీక్షలో ఎదుర్కొన్న
మానసిక యుద్ధాలు ఎన్నో
ఒకడివై వచ్చి బంధాల
అనుబంధాల దారులను
కలుపుకుంటివో

పాయలు పాయలుగా
యెడబాసిన అనుబంధాలను
నెన్నింటినీ కలిపినావో
పురిటి గడ్డను వదిలి
జీవన సమరంలో
లెక్కించలేనన్ని
అడుగులేసితివో

గర్భగుడిని చీల్చుకుని
అనంతమైన విశ్వాన్ని
చూసుటకై కను తెరిచితివి
అజ్ఞానము చేత
విజ్ఞానము పొందక
మూర్ఖత్వముతో
చెవిన మాటలాల కించక
పెడదారులెన్ని పట్టినావో

విశ్వములో ధనికునుగా
రాజ్యమేలాలని
సర్వ జీవుల కాదారమైన
ప్రకతిని చరబట్టి
అకాల వైపరీత్యాలకు కారకుడవై
విధ్వంసాలకు మూలమైనావో

అత్యాశ మకుటములు
ధరించుటకు గాను
ఎందరి శ్రమ ఫలాలను
దోచుకున్నావో

అహం నింపుకుని
అధికార దాహం
తీర్చుకొనుటకై
ఎందరెందరినో హింసించి
స్మశానానికి కడతేర్చినావో
ఎందరెందరో కష్టపలాలను
అక్రమ సంపదకై
ఆరాటపడినావో

ప్రజాస్వామ్యంలో
రాచరికం బుద్దిచే
అరాచకము ఏలుబడిలో
దిక్కారపు ఖంటఠములను
పెత్తన దురహంకారంచే
నులిపినావో

కామ క్రోధ మద మాత్సర్యముచే
కోరికల పుట్టను పెంచుకుని
పచ్చని భూ గ్రహంపై
చిచ్చుపెట్టి
చిరంజీవుడవనుకుంటివో

కోటాను కోట్ల చరిత్రను
తోడుకున్న ఒకప్పటి మంచిపనులే
నేటి సమాజానికి
మార్గ దిక్సూచిలని మరువకు

అస్తికలు, ఆస్తులు
భూమి సొంతమేనని గ్రహించు
బతకడం అంటే ఊపిరి పోయేదాక
పోషణ చేయడమే
మరో ఊపిరికి
మార్గదర్శకుడవ్వడమే

అనంత విశ్వంలో
ఎవరికి వారు మహా అనుకున్న
నీవొక లయవే
ఆనవాళ్లు లేని ధూళికణానివే
నేడు మెరుపు తారవైన

– యరకల యాదయ్య, 9866468979.