– మద్నూర్ ఉమ్మడి మండలంలో 34 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం
నవతెలంగాణ మద్నూర్
గ్రామాల్లో సర్పంచుల పాలన ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన ఉత్తర్వులు జారీ చేసింది మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి ఇరు మండలాల్లో మొత్తం 34 గ్రామపంచాయతీలకు సర్పంచుల పాలన ముగిసింది. గురువారం నుండి పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన వచ్చేసింది ప్రత్యేక అధికారులు గురువారం నాడు ఆయా పంచాయతీల్లో బాధ్యతలు చేపట్టారు 34 పంచాయితీలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైన ఉత్తరువు కాపీని మండల పంచాయతీ అధికారి గురువారం సాయంత్రం విలేకరులకు వాట్సాప్ ద్వారా అందజేశారు ఇక గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల పాలన ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులు చేపట్టనున్నారు.