కాకులను కొట్టి గుద్దలు కు పెట్టిన చందంగా మార్కెట్లో నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు దేనికదే పెరుగుతూ పోటీ పడుతున్నాయని కానీ పాలకులు పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తూ ప్రజలు నడ్డి విరుస్తున్నారు అని, పెరిగిన ధరలు తగ్గించి సామాన్యులు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ వాగొడ్డుగూడెం శాఖ మహాసభ స్థానిక కార్యకర్త రాజులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. మధ్యతరగతి సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కొనసాగుతున్న తరుణంలో నిత్యవసర వస్తువులు అయిన పప్పులు,బియ్యం రేట్లు పెంచి ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు అని అన్నారు. పండుగల సీజన్ మొదలైన ఈ సందర్భంగా భహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి అని, పెరిగిన ధరలను చూసి ఒక క్షణం ఆలోచించి కొందామా వద్దా అని ఇంకే మైన ప్రత్యామ్నాయం ఉందా అని ఆలోచించి స్థితికి వచ్చిందని అన్నారు. పెరిగిన ధరలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీపై నూనెలు, పప్పులు అందించాలని కోరారు. అనంతరం నూతన కార్యదర్శిగా కుంజా మురళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు గంగరాజు,ముత్యాల రావు లక్ష్మణరావు జోగయ్య దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.