నిరుద్యోగులను మోసం చేసిన అధికారపార్టీ

– లోకేషన్ ట్రెస్ చేసి అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు
నవతెలంగాణ – పెదవూర
నిరుద్యోగులను మోసం చేసి  100 రోజుల్లో నిరుద్యోగ సమస్యల పరిష్కారిస్తామని చెప్పి వారికీ ఇంతవరకు సమస్యలు పరిష్కరించ లేదని నాగార్జున సాగర్ నియోజకవర్గం బీజేపీ ఎస్టీ మోర్చా అసంబ్లీ కన్వీనర్ పాల్తీ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం నిరుద్యోగులను మోసగించిన కారణంగా  బిజెవైయం రాష్ట్ర శాఖ  టిజిపిఎస్సి ముట్టడి పిలుపును భగ్నం చేయడానికి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేయడం అక్రమమని అన్నారు.ఈ సంధర్భంగా ప్రభుత్వ తీరును భారతీయ జనతా యువమోర్చా గిరిజన మోర్చా పక్షాన ఖండిస్తున్నామన్నారు.శుక్రవారం నా లొకేషన్ ట్రేసు చేసి అక్రమంగా పాల్తితండ లో పెద్దవూర పోలీసులు అరెస్ట్ చెయడం అన్యాయం అని అన్నారు.ఉదయం 4 గంటల నుండి పెద్దవూర పోలీసులు  బీజే వైఎం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ బిజెపి ఎస్టి మోర్చా అసెంబ్లీ కన్వీనర్, పాల్తి  శంకర్ నాయక్  బిజెపి  పెద్దవూర మండల అధ్యక్షులు ఏరుకొండ నరసింహ,  కిసాన్  మోర్చా మండల అధ్యక్షులు జూలకంటి మట్టారెడ్డి, మండల నాయకులు చందా వెంకట్ రెడ్డి, పలస రవి, కోమల్ల వెంకటయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.