– ఫైనల్లో పోరాడి ఓడిన కేరళ స్టార్
– విజేతగా వెంగ్ హాంగ్ యాంగ్
– ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ (ఆస్ట్రేలియా) : భారత వెటరన్ షట్లర్, వరల్డ్ నం.9 హెచ్. ఎస్ ప్రణరు సీజన్లో రెండో టైటిల్ వేటలో తడబాటుకు గురయ్యాడు. మలేషియా మాస్టర్స్ టోర్నీ పతక పోరులో చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి.. ఆరేండ్ల డబ్ల్యూబిఎఫ్ టైటిల్ దాహం తీర్చుకున్న హెచ్.ఎస్ ప్రణయ్.. తాజాగా అదే ప్రత్యర్థి చేతిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. 90 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో 9-21, 23-21, 20-22తో హెచ్.ఎస్ ప్రణరు టైటిల్ చేజార్చుకున్నాడు. వరల్డ్ నం.24 వెంగ్ హాంగ్ యాంగ్‌తో ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ప్రణయ్.. తొలి గేమ్‌లో పూర్తిగా తేలిపోయాడు. కానీ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ నం.2, టాప్ సీడ్ ఆంటోని గింటింగ్‌పై సహా పలు కీలక మ్యాచుల్లో ప్రణరు తొలి గేమ్‌లో తడబాటుకు లోనైనా.. ఆ తర్వాత అద్వితీయ ప్రదర్శనతో పుంజుకున్నాడు. అదే ఫార్ములా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోనూ అనుసరిస్తునాడని అనిపించింది. నిర్ణయాత్మక గేమ్‌లోనూ ప్రణయ్ గెలుపు గీతకు చేరువగా నిలిచినా.. ఆఖర్లో ఊహించని రీతిలో కేరళ స్టార్ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో బీవెన్ జాంగ్ (అమెరికా), మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెంగ్ యాన్ జె, డాంగ్ పింగ్ (చైనా)..మెన్స్ డబుల్స్‌లో మిన్, జే (దక్షిణ కొరియా), మహిళల డబుల్స్‌లో కిమ్, కాంగ్ (దక్షిణ కొరియా) చాంపియన్లుగా నిలిచారు.
మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను 9-21తో చెత్తగా కోల్పోయినా.. రెండో గేమ్‌లో గట్టిగా పుంజుకున్నాడు. టైబ్రేకర్‌లో 23-21తో రెండో గేమ్‌ను గెల్చుకున్నాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. ఇక డిసైడర్‌లో ప్రణయ్ ప్రతాపం చూపించాడు. మలేషియా మాస్టర్స్ ఫలితం పునరావృతం అవుతున్నట్టే అనిపించింది. 19-14తో ఐదు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన ప్రణరు టైటిల్‌కు మరో రెండు పాయింట్లు దూరంలో నిలిచాడు. ఇక్కడే వెంగ్ హాంగ్ యాంగ్ మ్యాజిక్ షో చేశాడు. వరుసగా పాయింట్లు కొల్లగొట్టిన చైనా షట్లర్.. ప్రణయ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఐదు పాయింట్ల అంతరం చెరిపేసిన వెంగ్ హాంగ్ యాంగ్.. ప్రణరును మ్యాచ్ పాయింట్ వద్ద నిలువరించి మరీ టైటిల్ కొట్టాడు. టైబ్రేకర్‌లో 22-20తో మూడో గేమ్‌ను వెంగ్ సొంతం చేసుకున్నాడు. దీంతో హెచ్.ఎస్ ప్రణరు రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.