రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..

నవతెలంగాణ – వేములవాడ 
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ  నెలకొంది. వేకువజామునే భక్తులు ధర్మగుండ పుష్కరిణిలో పుణ్యస్నాన ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెమొక్కులను సమర్పించారు. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.