అమరుల త్యాగం మరవనిది

– మున్సిపల్ కార్యాలయంలో అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన కమిషనర్, పాలకవర్గం సభ్యులు
నవతెలంగాణ-దుబ్బాక
తెలంగాణ పోరులో అమరుల చేసిన ప్రాణా త్యాగాలు మరవలేనివని మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. గురువారం దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ వనితా భూమిరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులైన వారికి ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరుల పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా తగిన గౌరవం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ అధికం సుగుణ బాలకిషన్, కౌన్సిలర్లు దేవుని లలిత, లుంక రాజవ్వ, ఏంగారి స్వప్న, ఆస సులోచన, ఇల్లందుల శ్రీనివాస్, దివిటి కనకయ్య, నంద్యాల శ్రీజ, దుబ్బాక బాలకిషన్, పులి గారి కల్పన, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు ఉన్నారు.