అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఎఫ్ఆర్ఓ సుష్మారావు

The sacrifices of forest martyrs are unforgettable: FRO Sushma Raoనవతెలంగాణ – జన్నారం
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జన్నారం అటవీ రేంజ్ ఎఫ్ ఆర్ వో   సుష్మారావు అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ విధుల్లో చాలామంది అమరులయ్యారని, వారి త్యాగాలను స్మరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అటవీశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.