పోలీస్‌ అమరుల త్యాగాలు మరువలేనివి

– అమరవీరులకు ఘనంగా నివాళి
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
పోలీస్‌ అమరవీరులు చేసిన త్యాగాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటా యని, అమరుల త్యాగాలు మరువలేనివని హుస్నా బాద్‌ ఏసీపీ సతీష్‌ అన్నారు. శనివారం హుస్నాబాద్‌ సర్కిల్‌ కార్యాలయం ఎదుట పోలీస్‌ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎస్సై జాన్‌ విల్సన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌ సీఐ ఎర్రల కిరణ్‌, హుస్నాబాద్‌ ఎస్సై తోట మహేష్‌, ఏఎస్‌ఐలు మణెమ్మ, సురేందర్‌రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.