– మండల పరిషత్ కార్యాలయంలో అమరులకు శ్రద్ధాంజలి
– అధికారులు, ప్రజాప్రతినిధులు హజరు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త పుష్పలత అధ్యక్షతన గురువారం నిర్వహించారు. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటించి, సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారి త్యాగాలు వెలకట్టలేనివి అని వారిత్యాగాలు ఎంతో మందికి స్ఫూర్తిని నింపాయని కొనియారు. అమరుల త్యాగ ఫలం, కెసిఆర్ దీక్ష పట్టుదలతో తెలంగాణ సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర శర్మ, ఎమ్మార్వో సలీమ్ మియా, వైస్ ఎంపీపీ రవి, ఏఏంసి చైర్మన్ చింతల జ్యోతి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పలు శాఖల అధికారులు ఉన్నారు.