– బాసర త్రిబుల్ ఐటీ గేటు ముందు ధర్నా
నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ లో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే జీతాలు విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెనసురేష్ అన్నారు. బుధవారం కార్మికులు బాసర ట్రిపుల్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. బాసర త్రిబుల్ ఐటీ కార్మికులకు 10800 రూపాయలు జీతమే తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత బేసిక్ సాలరీ జీవో 60, ప్రకారము కార్మికులకు అమలు చేయాలని గత ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాసర త్రిబుల్ ఐటీ లో పని చేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకు రూ.16500 వేతనాలు అమలు చేయాలని తెలిపారు. ఇప్పుడు కార్మికులకు చేతికి 10800, వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. పిఎఫ్ 1200, ఇఎస్ఐ 200 కట్ అవుతుందన్నారు.మొత్తం జీతం 12200 కాంట్రాక్టర్ కార్మికులకు నెల జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు .కార్మికుల శ్రమ దోపి చేస్తున్నారని ఆరొపించారు. వారికి రావలసిన మొత్తం పూర్తి జీతం వెంటనే కార్మికులకు అందే విధంగా ఉన్నతాధికారులు చొరువా చూపాలని డిమాండ్ చేశారు. జివో 60 ప్రకారం రూ.16,500 కార్మికులకు నెల జీతం అమలు చేయాలని అన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో కార్మికుల కుటుంబాలు జీవన ఉపాధి కొనసాగించాలంటే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వారి యొక్క నెలసరి జీతం బేసిక్ శాలరీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాసర త్రిబుల్ ఐటీ ఆధ్వర్యంలో కార్మికులకు, ఐడి కార్డ్ తో పాటు,యూనిఫామ్ ఇవ్వాలన్నారు.సెలవులతో కూడిన వేతనం ఇవ్వాలన్నారు.త్రిబుల్ ఐటీ కార్మికులను రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. బిజేపి ప్రభుత్వము తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లు చట్టాలను రద్దు చేయాలన్నారు. జులై నెల పెండింగ్ జీతం వెంటనే విడుదల చేసి, 3సంవత్సరాల నుండి విడిఎ డబ్బులు చెల్లించలాన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం బాసర త్రిబుల్ ఐటీ కార్మికులకు కనీస వేతనం అమలు అమలు చేసి కార్మికులకు కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమంకు, కార్మికుల హక్కుల కోసం సమ్మె చేయడానికి కూడా వెనుకడం అని అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కరించకుంటే సెప్టెంబర్ నెల 9వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాంమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గైని మురళి, అధ్యక్షులు ఫిరాజి ,ప్రధాన కార్యదర్శి సాయిలు,ఉపాధ్యక్షులు లింగన్న,రెంజర్ల భారతి, దయానందు,సిద్దు సాయిలు, సహాయ కార్యదర్శి ,ప్రేమల గోదావరి, శారదమ్మ,కోశాధికారి లలితబాయి కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.