ఒకేతీరు

 the sameముగిసిన జి20 సదస్సు
మురిసే ప్రభుల మనస్సు

ఓట్ల పాట్లే ఈ తపస్సు
పౌరులకు చీకటే ఉషస్సు

ఢిల్లీ వీధులకు పరదాలు
నేతల ముంగిట్లో సరదాలు

పేదల గుండెల్లో గుబులు
ప్రశ్నిస్తే అర దండాలు

ప్రజాస్వామ్యమంటారు
నెత్తిన మంట పెడతారు

ఓట్లు గుంజి నంజుకుంటారు
నాడు నేడు ఒకే తీరు

మార్పులేదు చేర్పులేదు
మాటల మూటలే హౌరు

ముందు నుయ్యి వెనుక గొయ్యి
కండ్లు తెరచి ఓటు వెయ్యి
– ఎన్‌. నాగేశ్వరరావు
సెల్‌: 8688553470