పసుపు బోర్డు ఏర్పాటులో అదే వివక్ష..

The same discrimination in setting up the yellow board..– జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే లు బేషరతుగా రైతులకు క్షమాపణలు చెప్పాలి
నవతెలంగాణ – ఆర్మూర్ 
పసుపు బోర్డు ఏర్పాటుపై అదే వివక్ష జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని_కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వయంగా ప్రధాన మంత్రి గారితో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించిన జిల్లా ఎంపీ అరవింద్, ఎంఎల్ఏ లు రాకేష్ రెడ్డి లు పసుపు బోర్డు కు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని, మొన్నటి యూనియన్ బడ్జెట్ లో నిధుల గురించి ప్రస్తావన లేకపోవడం జిల్లా రైతులకు తీవ్ర నిరాశ కలిగించింది అని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ జిల్లా బీజేపీ నాయకులు ఎంపీ, ఎంఎల్ఏ లు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతారని అసెంబ్లీ తో పాటు, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే జిల్లా ప్రజలకు వారు చేసింది గుండు సున్నా అని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు తిరుగుబాటు చేయకముందే జిల్లా అభివృద్ధికి, పసుపు బోర్డు ఏర్పాటుకు తగిన నిదులు మంజూరు చేసే విధంగా బీజేపీ అగ్ర నాయకత్వం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు, లేకుంటే రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని అన్నారు.