– చింతల్ క్రాస్ వద్ద పొంగిపొర్లుతున్న జంపన్న వాగు..
– ఎల్బాక, పడిగాపురానికి వెనుక మేడారం నుండి రాకపోకలు..
– ఎల్బాక, పడిగాపురానికి వెనుక మేడారం నుండి రాకపోకలు..
నవతెలంగాణ – తాడ్వాయి
ఏజెన్సీని ముసురు కమ్మేసింది. మూడు రోజులుగా ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షం కూడా కురిసింది. ఫలితంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల మారాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తల్లి వెళ్లాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని తెలిపింది. మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఎస్ పి శబరిస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మార్వో రవిందర్, మండల ప్రత్యేక అధికారి అప్పయ్య, ఎంపీడీవో సుమన వాణి, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుత పర్యటించి నూతన ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కూలిపోయే ఇళ్లల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలలో నివాసం ఉంచుతున్నారు. మంత్రి సీతక్క కూడా పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు స్థానికంగా ఉంటూ ఆహురాత్రులు కృషి చేస్తున్నారు. చింతల్ క్రాస్ వద్ద జంపన్నవాగు పొంగిపొర్లడంతో అవతల ఉన్న పడిగాపూర్ ఎల్బాక గ్రామాల ప్రజలు, రైతులు అనారోగ్య బారిన పడిన వారు వెనుక బాగాన కొంగలమడుగు మీదుగా మేడారం నుండి మండల కేంద్రానికి వరంగల్ కు వెళ్తున్నారు. ఇంకా వర్షాలు బాగా కురిస్తే వెనుక కొంగలమడుగు కూడా ప్రవహిస్తుంది. అప్పుడు ఈ రెండు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోతాయి.
మేడారం జాతర పేరు మీద కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. తాత్కాలిక మరమ్మతులు పనులకు వేలకోట్ల రూపాయలు వెచిస్తుంది. మేడారం జాతరకు, జాతర అనంతరం ఎల్బాక, పడిగాపురం ఈ రెండు గ్రామాలకు అంతరాయం లేకుండా ఎన్ని వానలు పడ్డ ఇబ్బందులు లేకుండా రహదారి క్లియర్ గా ఉండటానికి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మించడం లేదు. జాతరకు జాతర అనంతరం స్థానికులకు ఉపయోగపడే పనులను ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.

జంపన్న వాగు ప్రవహిస్తుందని సమాచారం మేరకు స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, పస్రా సిఐ రవీందర్, ప్రత్యేక అధికారి అప్పయ్య, ఎంపీడీవో సుమనవాని, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు రెండు టీంలుగా బయలుదేరి హుటా హుటిన జంపన్న వాగు ప్రాంతాని, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగు ఉధృతిని పరిశీలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భారీకేడ్లను ఏర్పాటు చేశారు. జాలర్లు భక్తులు జంపన్న వాగు వద్దకు వెళ్లొద్దని సూచించారు. అక్కడ కొంతమంది సిబ్బందిని నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు వారి సలహా సూచనలు లేకుండా వాగును దాటద్దని తెలిపారు. ఇంకా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఇంకా జంపన్న వాగు మిగతా వాగులు పొంగిపొర్లి నీరు చేరే ప్రమాదం ఉన్నందున, పరిసరం ప్రాంతాల గ్రామాల ప్రజలు నీళ్లళ్లకు వెళ్లకుండా, ప్రయాణించకుండా ఇండ్లలోనే ఉండాలన్నారు. పొలాల్లో ఉండే విద్యుత్ స్తంభాలను ముట్టుకో రాదన్నారు. రైతులకు కూడా విద్యుత్ లైన్ల వద్ద స్తంభాల వద్ద చాలా జాగ్రత్త వహించాలని సూచించారు.